దేశంలోనే మొదటిసారి
ABN , Publish Date - May 15 , 2025 | 10:40 PM
దేశంలో మొదటిసారి ప్రారంభించే ఇందిర సౌర గిరి జలవికాస పథకం గిరిజనులకు ఎంతో ఉప యోగకరమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.
- ఇందిర సౌర గిరి వికాస పథకం గిరిజనులకు ఉపయోగకరం
- ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట/అమ్రాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో మొదటిసారి ప్రారంభించే ఇందిర సౌర గిరి జలవికాస పథకం గిరిజనులకు ఎంతో ఉప యోగకరమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి నల్ల మల పర్యటనకు వస్తున్నందున అమ్రాబాద్ మం డల పరిధిలోని మాచారంలో ఏర్పాటు చేసిన సభ ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్‌లు పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రారంభించ నున్న ఇందిర సౌర గిరి జలవికాస పథకానికి సంబంధించి సభా వేదిక తదితర పనులను అధికారులు ఎంతో బాధ్యతాయుతంగా ని ర్వర్తిస్తున్నారు. 6లక్షల ఎకరాల గిరిజనులకు సంబంధించిన భూ ములు ఈ పథకానికి ఎంపిక కావడం వల్ల 2.10లక్షల మంది గిరి జన రైతులు లబ్ధిపొందుతారన్నారు. సభకు పెద్ద ఎత్తున అభిమా నులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. అదనపు కలెక్టర్ దేవసహాయం, జిల్లా అటవీ అధికారి రో హిత్ గోపిడి, డీటీడీవో అధికారి ఫిరంగి, పంచాయతీ అధికారి రాం మోహన్, డీఆర్‌డీవో పీడీ చిన్న ఓబులేసు, జిల్లా గ్రంథాలయ చైర్మ న్ రాజేందర్, అచ్చంపేట ఆర్డీవో మాధవి, నాయకులుపాల్గొన్నారు.
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సా మాజిక న్యాయానికి కట్టుబడి ఉందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మాచరం గ్రామంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను డీసీసీ అఽఽధ్యక్షుడు అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నా రాయణ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎన్నో వి నూత్న పథకాలు ప్రవేశ పెట్టిన స్వర్గీయ ఇందరిగాంధీ పరిపాలన ను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇందిరా సౌర జలగిరి వికాస పథకం ఆది వాసి గిరిజనులకు వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు సాగునీటి సమ స్య తీరుతుందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సీఎంపై చేస్తు న్న ఆరోపణలు వారి కుటిల నితిని బయటపెడ్తుందన్నారు. వారికి ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చ రించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశృకృష్ణ మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో సీఎం ప్రారంభించే సౌర జల గిరి వికాస పథకం దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. నల్లమల ప్రాంతంలో పర్యాటక అభివృద్ధితో పాటు అచ్చంపేట నియోజకవ ర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని ఎంపీ మ ల్లురవితో కలిసి సీఎంకు విన్నవించనున్నట్లు తెలిపారు. సాగునీటి పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి మా ట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. జి ల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట ముని సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బాలజీ సింగ్, ప్రముఖ కాంట్రాక్టర్ జలందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.