Share News

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:30 PM

తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆదివారం పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
ఉత్తనూర్‌ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి దర్శనంలో పాల్గొన్న భక్తులు

గద్వాల అర్బన్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆదివారం పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కోటలోని భూలక్ష్మి చెన్నకేశస్వామి ఆల యం, నదీఅగ్రహారం వేంకటేశ్వరస్వామి ఆల యం, అన్నపూర్ణేశ్వరి ఆలయంలో లక్ష్మీనారాయ ణ స్వామికి, పీజేపీ క్యాంపులోని లక్ష్మీ వెంకటేశ్వ ర స్వామి ఆలయం, పెద్ద అగ్రహారంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో భక్తులు పెద్దసం ఖ్యలో పూజలు చేశారు. లక్ష్మీనారాయణ స్వామికి విశేష ఫలపంచామృతాభిషేకం, పెద్దఅగ్రహారం లో నృసింహస్వామికి విశేష పూజలు, నదీఅగ్ర హారం వద్ద గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆయా ఆలయాల్లో విష్ణుసహస్ర నామ పారాయణం చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 11:30 PM