Share News

మాటల మంటలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 10:57 PM

మరో ఏడాది కాలగమనంలో కలిసిపోనుంది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి.. బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా మారి రెండు సంవత్సరా లు గడిచిపోయింది. మొదటి నుంచీ రాజకీయ అస్ర్తాలకు కేంద్ర బిందువుగా, ఎజెండా ఉంటూ వ స్తున్న పాలమూరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. బీఆర్‌ఎస్‌ కూడా అక్కడే తన దృష్టి కేంద్రీకరించింది.

మాటల మంటలు
నారాయణపేటలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి(ఫైల్‌)

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

నెలలో ఒకసారైనా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మెజారిటీ ప్రయోజిత పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం

సర్పంచు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌

ఆ తర్వాత స్థానం దక్కించుకున్న బీఆర్‌ఎస్‌

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్రంగా ఏడాది చివరిలో రాజకీయ రగడ

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మరో ఏడాది కాలగమనంలో కలిసిపోనుంది. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి.. బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా మారి రెండు సంవత్సరా లు గడిచిపోయింది. మొదటి నుంచీ రాజకీయ అస్ర్తాలకు కేంద్ర బిందువుగా, ఎజెండా ఉంటూ వ స్తున్న పాలమూరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. బీఆర్‌ఎస్‌ కూడా అక్కడే తన దృష్టి కేంద్రీకరించింది. నెలకోసారైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో.. పూర్తయిన పనుల ప్రారంభోత్సవాల్లో పా ల్గొంటున్నారు. ఆయా సందర్భాల్లో నిర్వహించిన సభల్లో మాటల తూటాలను పేల్చారు. సీఎం విమర్శలను ఎక్కుపెట్టిన ప్రతీసారి ప్రతిపక్షాలు కూడా అంతే దూకుడుగా తమ కౌంటర్లు ఇస్తూ పోయాయి.

ఉమ్మడి జిల్లా నుంచే పథకాల ప్రారంభం

పలు ప్రయోజిత పథకాలన్నింటినీ సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు నుంచే శ్రీకారం చుట్టారు. ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని అచ్చంపేట నియోజకవర్గంలో మా చర్ల కేంద్రంగా ప్రారంభించగా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను సీఎం సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ నుంచి శ్రీకారం చుట్టారు. అలాగే మద్దూరు నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు. నారాయణపేటలో రాష్ట్రంలోనే తొ లి మహిళా సమాఖ్య ఆ ధ్వర్యంలో పెట్రోల్‌ బం కును ప్రారంభించారు. మైనారిటీలకు కుట్టు మి షన్ల పంపిణీని వనపర్తి నుంచి అందించారు. ఇక ఎస్‌ఎల్‌బీసీని రెండుసార్లు పరిశీలించారు. మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌, దేవరకద్ర, వనపర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో సీఎం పర్యటించారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని పనులు ప్రారంభం కాగా.. మరికొన్ని పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. ఇంకొన్ని టెండర్ల దశకు కూడా చేరుకో లేదు. ఇదిలా ఉంటే రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ సంవత్సరం కూడా ఉమ్మడి జిల్లాలో తన ఆధిపత్యాన్ని చూపించిందని చెప్పొచ్చు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎ్‌సను వీడి.. కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఇక వనపర్తి, గద్వాలలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు సర్వసాధారణంగా కొనసాగింది. ఆ పార్టీ అన్ని జిల్లాలకు నూతన డీసీసీ అధ్యక్షులను నియమించింది.

పంచాయతీల్లో కాంగ్రెస్‌ హవా...

షెడ్యూల్‌ ప్రకారం 2024 జనవరి, ఫిబ్రవరిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2025 డిసెంబరులో జరిగాయి. రెండేళ్ల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలు నిర్వహించారు. మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 పంచాయతీలు ఉండగా, అందులో ఏడు పంచాయతీలకు ఎన్నికలు జరుగలేదు. మిగిలిన వాటిలో కాంగ్రెస్‌ 965 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారు. అయితే బీఆర్‌ఎస్‌ కూడా తన బలాన్ని చాటుకుంది. కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో సగటున సగం స్థానాలు 475 కైవసం చేసుకుంది. గతంలో కంటే బీజేపీ కూడా తన స్థానాలను మెరుగుపరుచుకుంది. 86 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. సీపీఐ ఒక స్థానంలో, సీపీఎం దాదాపు 8 స్థానాల్లో తన మద్దతుదారులను గెలిపించుకుని బలం పెంచుకుంది. పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా పంచాయతీ ఎన్నికల సమరాన్ని మక్తల్‌ బహిరంగ సభలో ప్రారంభించగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాలికి బలపం కట్టుకున్నట్లు తిరిగారు. గతంలో లేని విధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో చెమటోడ్చారు. గ్రామాల్లో నెలరోజులపాటు మద్యం ఏరులై పారింది. గతంలో లేని విధంగా ఓటుకు నోటు స్థాయి మారింది. ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ. 2వేల వరకు ఉమ్మడి జిల్లాలో పంపిణీ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఈ స్థాయి ప్రలోభాలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వలస ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేమెంట్‌ యాప్‌ల ద్వారా తాయిళాల పంపిణీ, హైటెక్‌ ప్రచారం, విలేజ్‌ మేనిఫెస్టోలతో గ్రామాలు రాజకీయ సంగ్రహశాలలుగా మారిపోయాయి.

మళ్లీ నీళ్లే ఎజెండా..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు నీటి కేంద్రంగానే నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఎజెండాలో పాలమూరు కరువు, ప్రాజెక్టుల పూర్తి అంశాలే ప్రధానంగా మారాయి. రెండేళ్ల క్రితం అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ మళ్లీ అదే ఎజెండాతో రాజకీయ వేడిని రగిల్చేందుకు ప్రయత్నిస్తుండగా, వారు రగిలిస్తున్న వేడిపై కేసీఆర్‌ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నీళ్లు పోస్తూ వెళ్తున్నారు. ఈ ఏడాది చివరిలో.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం లేదనే కారణంతో నీళ్లవైపు చర్చను మళ్లించారు. రేవంత్‌రెడ్డి కూడా కొడంగల్‌ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో ఘాటు విమర్శలు.. పరుష పదజాలంతో కేసీఆర్‌, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.

అసెంబ్లీలో ఎత్తుగడలు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. కొత్త సంవత్సరంలో ఎవరికి వారు అసెంబ్లీలో కొట్లాడటానికి ఎత్తుగడలు వేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు తేలేదని, తాగునీటి ప్రాజెక్టుగా చూపించి.. నామమాత్రపు పనులు చేసిందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. ఇప్పుడు పనుల ఆలస్యాన్ని తమవైపు నెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. ఈ చర్చ ఈ ఏడాది చివరిలో ప్రారంభమై కొత్త సంవత్సరంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపే దిశగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం అటు బీఆర్‌ఎ్‌సపై, ఇటు కాంగ్రె్‌సపై విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ విధానాలను, ఆ పార్టీ అధికార పార్టీపై చేస్తున్న ఆరోపణలను పలుచన చేసేవిగా ఉన్నాయి.

Updated Date - Dec 30 , 2025 | 10:57 PM