Share News

ఎమ్మెల్యేపై ఫైర్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:03 PM

కారు గుర్తుతో గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తే ఊరుకోవాలా..? అని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూర్‌ లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

ఎమ్మెల్యేపై ఫైర్‌

- కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తే ఊరుకోవాలా?

గద్వాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కారు గుర్తుతో గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో పెత్తనం చెలాయిస్తే ఊరుకోవాలా..? అని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూర్‌ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కారు గుర్తుతో గెలిచిన మీరు ఇప్పుడు ఏ పా ర్టీలో ఉన్నారో మీరే చెప్పలేనిస్థితిలో ఉన్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెటూర్లలో ఇందిరమ్మ కమిటీల పేరుతో వైషమ్యాలు సృష్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయని వారు ఇందిరమ్మ కమిటీలకు అర్హులు ఎట్లా అవుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిని అభివృద్ధి అంటారా.. అరాచకమంటారా? మీకు ఓట్లు వేసిన ఓటర్లకు సమాధానం చెప్పాలని సూచించారు. రాత్రనక, పగలనక, కాంగ్రెస్‌ జెండా మోసిన వారికి ప్రభుత్వ పథకాలు దక్కకుండా చేస్తున్న మీకు తగిన గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అ న్నారు. కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నావని ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు అర్థం అవుతున్నదన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎమ్మెల్యే వర్గానికి కొమ్ము కాస్తే సామాన్య ప్రజ ల నుంచి మీకు నిరసన తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కబీర్దాస్‌ నర్సింహులు, జమ్మిచేడు ఆనంద్‌, టీఎన్‌ ఆర్‌ జగదీశ్‌, పటేల్‌ శ్రీనివాసులు, రాజారెడ్డి, మహానంది, అనంతాపురం రాములు, దడవా యి నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:03 PM