ఆర్టీసీ బస్సులో మంటలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:23 PM
షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సుల్లో మంటలు చెలరేగిన సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం కోస్గి బస్టాండ్ నుంచి నారాయణపేటకు బయల్దేరింది.
కోస్గి సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సుల్లో మంటలు చెలరేగిన సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం కోస్గి బస్టాండ్ నుంచి నారాయణపేటకు బయల్దేరింది. శివాజీ కూడలికి చేరుకోగానే షార్ట్ సర్క్యూట్‌తో ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి, వాటర్ బాటిల్‌లో ఉన్న నీళ్లు పోసి, మంటలను ఆర్పాడు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. మంటలు అంటుకోవడంతో బస్సులో పొగ చుట్టుకుంది. కొందరు ప్ర యాణికులు బస్సులోంచి కిందకు దూకారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి, బస్సును డిపోకు పం పించారు. ప్రయాణికులకు ఇబ్బంది వాటిల్లకుండా కోస్గి డిపోకు చెందిన మరో బస్సును నారాయణపేటకు పంపించారు.