ఓటర్ల తుది జాబితా విడుదల
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:57 PM
గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాగా సర్పంచు వార్డు మెంబర్లను ఎన్నుకునే ఓటర్ల జాబితా కూడా సిద్ధం అయ్యింది.
- జిల్లాలో 3,93,418 మంది ఓటర్లు
గద్వాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వాహణ చకచకా సాగిపోతున్నది. గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాగా సర్పంచు వార్డు మెంబర్లను ఎన్నుకునే ఓటర్ల జాబితా కూడా సిద్ధం అయ్యింది. ఎన్ని కల సంఘం ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఓటర్ల సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఓటరు దరఖాస్తు లు, అభ్యంతరాలను స్వీకరించి 23న తుది ఓటరు జాబితాను విడుల చేసింది. దాని ప్రకారం జిల్లాలో మొత్తం 3,93,418 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,93,627 మంది పురుషులు కాగా 1,99,781 మంది మహిళలు, ఇతరులు 10మంది ఉన్నారు. వీరందరు 255 మంది గ్రామ సర్పంచులు, 2,390 మంది వార్డు మెంబర్లను ఎన్నుకోనున్నారు.
మూడు దశల్లో ఎన్నికలు
జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్‌ఓలు 362మంది, పీఓలు 1,480 మంది, ఓపీఓలు 2,198మంది మాత్రమే ఉన్నారు. మూడు దశలలో నిర్వహిస్తేనే సిబ్బంది సరిపోతారని గుర్తిం చి మూడు దశల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘానికి నివేదించారు. మొదటి దశలో గద్వాల, గట్టు, ధరూర్, కేటీదొడ్డి మండలాల్లోని 106 గ్రామ పంచాయతీలు, 974 వాడ్డులు ఉన్నాయి. రెండవ దశలో మల్దకల్, అయి జ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో 74 గ్రామ పంచాయతీలు, 716 వార్డులు. మూడవ దశలో ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాలలోని 75 గ్రామ పంచాయతీలు, 700 వార్డులు ఉన్నాయి.
మండలాల వారీగా ఓటర్ల జాబితాల ఇలా..
మొదటి విడతలో..
మండలం గ్రామాలు వార్డులు పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు
గద్వాల 28 248 17,565 18,224 35,789
గట్టు 27 262 23,294 24,266 47561
ధరూర్ 28 254 19,015 19,893 8,908
కేటీదొడ్డి 23 210 14,106 14,308 23,414
రెండవ విడతలో..
మల్దకల్ 25 242 21349 2,212 3,561
అయిజ 28 279 22,761 23,213 45,980
రాజోలి 11 110 14,005 14,270 28,275
వడ్దేపల్లి 10 94 8,342 8,443 6,785
మూడవ విడతలో..
ఇటిక్యాల 14 130 9,382 9,586 18,969
ఎర్రవల్లి 15 144 11,535 11,810 23,345
అలంపూర్ 14 120 8,582 8,793 17,375
మానవపాడు 17 164 12,622 13,224 25,846
ఉండవెల్లి 15 142 11,069 11,589 22,610