ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సినీ నటులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:16 PM
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జ లవిద్యుత్ కేంద్రం పనితీరు అద్భుతమని సినీ నటులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత అన్నారు.
బ్రహ్మగిరి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జ లవిద్యుత్ కేంద్రం పనితీరు అద్భుతమని సినీ నటులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ కేంద్రం పనితీరు గురించి ఉద్యోగులు వారి కి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో భూగర్భంలో ఇంతటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం ఉండటం ఎంతో గర్వకార ణమని, విద్యుత్ కేంద్రాన్ని తమకు ఎంతో ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. సందర్శనకు అనుమతిచ్చిన జెన్‌కో సీఈ కేవీవీ సత్య నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.