Share News

బీచుపల్లిలో సినీ నిర్మాత అల్లు అరవింద్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:35 PM

సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తన తల్లి కనకరత్నం అస్థికలను బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు.

బీచుపల్లిలో సినీ నిర్మాత అల్లు అరవింద్‌
బీచుపల్లిలో తన తల్లి కనకరత్నం అస్థికల నిమజ్జన కార్యక్రమంలో అల్లు అరవింద్‌, తనయుడు బాబి

- తల్లి కనకరత్నం అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం

ఎర్రవల్లి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గీతా ఆర్ట్స్‌ అధినేత, సినీ నిర్మాత అల్లు అరవింద్‌ తన తల్లి కనకరత్నం అస్థికలను బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. ఆయన తల్లి కనకరత్నం ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. అస్థికలకు పుష్కరఘాట్‌ పురోహితుడు అనిల్‌శర్మ వేదమంత్రోచ్చరణ మధ్య పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నది ఒడ్డున అల్లు అరవింద్‌ స్నానమాచరించారు. అనంతరం పడవలో వెళ్లి నదిలో కలిపారు. కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. ఆయనతో పాటు పెద్దకుమారుడు అల్లు బాబి ఉన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:35 PM