నిండిన కుంటలు.. పొంగిన వాగులు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:47 PM
జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపారాయి.
- పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలు
- జలదిగ్బంధంలో మెన్నిపాడు
జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపారాయి. చెరువులు, కుంటలు నిండి వాగులు ఉధృతంగా ప్రవహించాయి. మొక్కజొన్న, పత్తి, కంది, ఉల్లి, మిరప తదితర పంటలు వాడుముఖం పట్టే క్ర మంలో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో కుంటలు నిండి వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఎగువన కురిసిన వర్షాలకు బొంకూరు వాగు పొంగి సమీపంలోని పంట పొలాలను ముంచె త్తింది. గ్రామానికి చెందిన మద్దిలేటి, రాముడు, లక్ష్మన్న, డానియెల్, వెంకట్రాముడు, కురువ సంజన్న, నరసింహులు తదితర రైతుల పొలాలు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. ఇదే వంక మెన్నిపాడు గ్రామానికి వెళ్లే దారిని దాటి తుంగభద్రనదిలో కలుస్తుంది. లోవంతెన ఉండడం వల్ల వరద ఉధృతంగా పారుతుండ డంతో మెన్నిపాడు గ్రా మానికి ఎనిమిది గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.