రైల్వేస్టేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:41 PM
వికారాబాద్, కృష్ణ రైల్వేలైన్‌లో ఉన్న ఊట్కూ ర్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే వరకు పోరా టం కొనసాగిస్తామని ఊట్కూర్ రైల్వేస్టేషన్ సాధన సమితి అధ్యక్షుడు ఎం.భాస్కర్, కార్యద ర్శులు విజ్ఞేశ్వర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ అన్నారు.
- ఊట్కూర్ రైల్వే స్టేషన్ సాధన సమితి
ఊట్కూర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్, కృష్ణ రైల్వేలైన్‌లో ఉన్న ఊట్కూ ర్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే వరకు పోరా టం కొనసాగిస్తామని ఊట్కూర్ రైల్వేస్టేషన్ సాధన సమితి అధ్యక్షుడు ఎం.భాస్కర్, కార్యద ర్శులు విజ్ఞేశ్వర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ మందిరంలో ఏర్పాటు చేసి అఖిల పక్ష సమా వేశంలో వారు మాట్లాడారు. 27 పంచాయతీల తో పాటు కర్ణాటకలోని పది గ్రామాలకు రవా ణా సౌకర్యం కల్పించే అవకాశం ఉన్న ఊట్కూ ర్‌లో స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రాం తాన్ని అన్యాయం చేయడం అవుతుందన్నారు. రైల్వేశాఖ గతంలో విడుదల చేసిన డీపీఆర్‌లో ఊట్కూర్‌లో స్టేషన్ ఉన్నా.. కొత్త డీపీఆర్‌లో మాత్రం లేకుండా హాల్ట్ అని ఉందని తెలి పారు. డీపీఆర్ మార్చి మండలానికి అన్యాయం చేశారన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ లోగో పోస్టర్‌ను విడుదల చేశారు. అంతకుముందు స మావేశంలో వివిధ పార్టీలు, స్వచ్చంద సంస్థల నాయకులు మాట్లాడి కలిసి పొరాటం చేయడం కోసం ఊట్కూర్ రైల్వే స్టేషన్ సాధన సమితిని ఏర్పాటు చేశారు.
సమావేఽశంలో విజ్ఞేశ్వర్‌రెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి, డాక్టర్ రఘు, శంకర్, భాస్క ర్, లక్ష్మారెడ్డి, హన్మంతు, కృష్ణయ్యగౌడ్, భరత్, కొండన్‌గోపాల్, అరవింద్‌కుమార్, గంగాధర్ సమీ, ఖాలీక్, హుస్నాబాద్ పాషా, వకార్, నా రాయణ, రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
====