Share News

లేబర్‌కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాటం

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:01 PM

నాలు గు లేబర్‌కోడ్లకు వ్యతిరేకంగ బుధవారం సార్వ త్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో సీఐటీ యూ, టీయూసీఐ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, అనంతరం మునిసిపల్‌ ఆవరణలో సభ ఏర్పాటు చేశారు.

లేబర్‌కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాటం
జడ్చర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు

- సమ్మెలో పాల్గొన్న కార్మికులు

- భారీర్యాలీ, సభలు ఏర్పాటు

పాలమూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నాలు గు లేబర్‌కోడ్లకు వ్యతిరేకంగ బుధవారం సార్వ త్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో సీఐటీ యూ, టీయూసీఐ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ, అనంతరం మునిసిపల్‌ ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఐఎన్‌టీ యూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్‌, ఏఐ టీయూసీ కార్యదర్శి పీ.సురేష్‌, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీ.వెంకటేష్‌, టీఎన్‌టీయూసీ నా యకులు రాములు, సాంబశివుడులు ప్రసంగిం చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29కార్మిక చట్టాలను నాలుగులేబర్‌ కోడ్లుగా తీసుకువచ్చి తీరని ద్రోహం చేస్తోందన్నారు. తక్షణమే కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాలి

కేంద్రం ప్రభుత్వ రంగం సంస్థలు నిర్వీర్యం చేస్తోందని ఐసీఈయూ యూనియన్‌ హైదరా బాద్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు సి.రాజేశ్వర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాలకు చెందిన ఉద్యో గులు అధికసంఖ్యలో సమ్మెలో పాల్గొని ఎల్‌ఐసీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ సభ నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా జనరల్‌ ఆసుపత్రి కార్మికు లు గంటపాటు విధులు బహిష్కరించి ఆసుప త్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.

జడ్చర్ల: కార్మికులను నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్రం రద్దు చేయాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాడు జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా జడ్చర్లలోని వివిధ కార్మికసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సమ్మె సభను ఏర్పాటు చేశారు.

కోయిలకొండ: కార్మికులను బానిసలుగా మా ర్చడానికి తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో కార్మికుల నిరసన ర్యాలీ చేపట్టారు.

Updated Date - Jul 09 , 2025 | 11:01 PM