బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:04 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు.
అఖిలపక్షం నాయకులు
ఈడబ్ల్యూఎస్‌లకు లేని ఆటంకాలు బీసీలకే ఎలా వస్తాయో చెప్పాలి
బీజేపీ రెండు నాల్కల ధోరణి
గద్వాలలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం
గద్వాలఅర్బన్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర బంద్ రిజర్వేషన్ల సాధన ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో పోరాటం కొనసాగుతుందని, దీన దీనిపై కార్యాచరణ రూ పొందిస్తామని తెలిపారు. ఆదివారం పట్టణం లో వాల్మీకి భవన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మా ట్లాడారు. ముందుగా బంద్‌కు సహకరించిన వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పార్టీ నా యకులకు, పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలి పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వ్యహరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా బంద్ చేపట్టా మన్నారు. ఒకవైపు కేంద్రం రిజర్వేషన్ల బిల్లును ఆర్డినెన్స్ అడ్టుకుంటూనే మరోవైపు రాష్ట్రంలో బీసీలు చేపట్టిన బంద్‌కు మద్దతు ప్రకటించడం విడ్దూరమన్నారు. శాసనసభలో బీసీల రిజర్వేష న్‌కు సంబందించిన బిల్లును ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నా రు. ఈడబ్ల్యూఎస్‌లకు లేని ఆటంకాలు బీసీలకే ఎలా వస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తొమ్మిదో షెడ్యూల్‌లో చే ర్చాలనే డిమాండ్‌ను భవిష్యత్‌లోనూ కొనసాగు తుందన్నారు. దేశవ్యాప్తంగా కులగనణ చేపట్ట కుండా ప్రజల మధ్య విద్వేష, విభజన రాజకీ యాలకు కారణమవుతున్న బీజేపీ రెండు నాల్క ల ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఈ విష యాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నా రు. గవర్నర్ ఆమోదించినందు వల్లే కోర్టు స్టే వి ధించిందన్నారు. రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెం ట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను కలుపుకుని రిజర్వేషన్ల సాధనకోసం ఢిల్లీలో కేంద్ర ప్రభు త్వంపై నిరవధిక ఉద్యమాలకు సిద్ధం కా వాల న్నారు. సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర కా ర్యదర్శి మధుసూదన్‌బాబు, బీసీ జేఏసీ నాయ కులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వా మి, ఆంజనేయులు, ఆలూరు ప్రకాష్‌గౌడ్, శంక ర ప్రభాకర్, వాల్మీకి, వినోద్‌కుమార్, కురువ ప ల్లయ్య, గంజిపేట రాజు, టవర్ మక్బుల్, శ్రీని వాసులు, ఉప్పేరు నరసింహ, ధరూరు రవి, నా గన్న, కృష్ణ, భద్రప్ప, నరసింహ, రాజేశ్ పాల్గొన్నారు.