Share News

కార్మికుల హక్కుల కోసం పోరాడాలి

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:11 PM

కార్మికుల హక్కుల కోసం విరోచితంగా పోరాడాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పిలుపు నిచ్చారు.

 కార్మికుల హక్కుల కోసం పోరాడాలి
రాష్ట్ర రెండో సభలో ప్రసంగిస్తున్న టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం

- టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం

నారాయణపేట, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల కోసం విరోచితంగా పోరాడాలని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పిలుపు నిచ్చారు. శనివారం నారాయణపేట మెట్రో గార్డెన్‌లో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రా మ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన నిర్వ హించిన తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచా యతీ వర్కర్స్‌ యూనియన్‌(టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర రెండవ మహాసభల్లో మాట్లాడుతూ చరిత్రలో కార్మికులు పోరాడ కుండా ఏ హక్కులు సా ధించలేదని అ న్నారు. కార్మికులు గత సంవత్సరంలో తమ హ క్కుల కోసం సమ్మె చేస్తే సమ్మె దగ్గరికి నాటి ప్రతిపక్ష, నేటి అధికార కాంగ్రెస్‌ మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం మిమ్మల్ని పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి రెండు అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కార్మికు ల గురించి మాట్లాడలేదన్నారు. ఇది మోస మే కదా అన్నారఽు. ధనవంతులు తినే సన్న బియాన్ని ప్రతి పేదోడికి ఇచ్చి మంచి బోజ నం చేయమంటున్న సీఎం రేవంత్‌రెడి ముందు సన్నబియ్యం ఉచిత పఽథకాలు తమకు అవసరం లేదని, కనీస వేతనాలు అమలు చేసి పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయండి అని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కార్మికుల కాళ్లు కడిగారు.. కానీ ఒకపక్క లేబర్‌ కోడ్లు తెచ్చి కార్మికుల కు కనీసం యూనియన్‌ ఏర్పాటు చేసుకునే హక్కును హరించారని ఆరోపిం చారు. స మస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటి తంగా పోరాడాలన్నారు. టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హన్మేష్‌, అరుణ్‌కు మార్‌, కిరణ్‌, బి.నర్సిములు, కాశినాథ్‌, రాము, వెంకట్రాములు, సాంబశివుడు, కుర్మ య్య, గణేష్‌, చంద్రం, కృష్ణ, వెంకట్‌, ముత్తయ్య, గోపాల్‌రావు, అప్పారావు, రాందాజ్‌ తదితరు లున్నారు. అనంతరం కార్మికుల ప్రదర్శన ర్యాలీ పురవీధుల గుండా అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా కొత్తబస్టాండ్‌, నర్సిరెడ్డి చౌరస్తా వరకు కొనసాగింది.

Updated Date - Apr 05 , 2025 | 11:11 PM