శాస్ర్తీయ విద్యా విధానం కోసం పోరాడుదాం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:04 PM
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెం చేందుకు ఉపయోగపడే శాస్ర్తీయ విద్యా వి ధానం కోసం పోరాడుదామని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు అన్నా రు.
- పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు
- జిల్లా కేంద్రంలో నాలుగవ జిల్లా స్థాయి మహాసభ
గద్వాల టౌన్, డిసెంబరు 8 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను పెం చేందుకు ఉపయోగపడే శాస్ర్తీయ విద్యా వి ధానం కోసం పోరాడుదామని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు అన్నా రు. అదే సమయంలో మూఢ నమ్మకాలను, మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా ఉ న్న నూతన జాతీయ విద్యా విధానాన్ని వి ద్యార్థిలోకం వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పట్టణంలోని యూనియన్ కార్యాలయం వద్ద సోమవారం పీడీఎస్‌యూ నాల్గవ జి ల్లాస్థాయి మహాసభ నిర్వహించారు. పీడీ ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా, రా ష్ట్ర కార్యదర్శి వెంకటేష్, విజయ్, వీరప్రతాప్, క్రాంతి కుమార్, వెంకటేష్, కలీం, వీ రేష్, మహేష్ తది తరులు ఉన్నారు.
కార్మికులను పర్మినెంట్ చేయాలి
గ్రామ పంచా యతీల్లో పనిచేస్తు న్న కార్మికులను ప ర్మినెంట్ చేయా లని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవ న్‌లో ప్రగతిశీల ఆదర్శ గ్రామ పంచాతీయ కార్మికుల జిల్లా మహాసభను ని ర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం కొత్త గా రూపొందిం చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయా లన్నారు. కనీస వేతనం రూ. 26వేలు అం ద జేసి సహజ మ రణానికి రూ.5లక్ష ల భీమా సదుపాయం ఇవ్వాలన్నారు. మహాసభ సం దర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచా యతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ జెండాను ఎగురవేశారు. న్యాయవాది మధుసూదన్‌బాబు, టీపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ శంకర ప్రభాకర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బీరెల్లి దానయ్య ఉన్నారు.