నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:01 PM
కేంద్రంలో ప్రభుత్వం కార్మిక,రైతు,వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే నల్లచట్టాలను తీసుకొ చ్చిందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో ధర్నా చేపడుతున్నట్లు నాయకులు తెలిపా రు.
పాలమూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ప్రభుత్వం కార్మిక,రైతు,వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే నల్లచట్టాలను తీసుకొ చ్చిందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో ధర్నా చేపడుతున్నట్లు నాయకులు తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీ ఐటీయూ కార్యాలయంలో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘా ల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాము లుయాదవ్, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడారు. ధర్నాలో అధిక సం ఖ్యలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికు లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.