Share News

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

ABN , Publish Date - May 21 , 2025 | 11:07 PM

పండుగలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచిం చారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బక్రీద్‌, హనుమాన్‌ జయంతి పండుగలను పుర స్కరించుకుని మత పెద్దలతో సమావేశం నిర్వ హించారు.

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
మాట్లాడుతున్న ఎస్పీ రావుల గిరిధర్‌

- ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి, మే 21 (ఆంధ్రజ్యోతి) : పండుగలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచిం చారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బక్రీద్‌, హనుమాన్‌ జయంతి పండుగలను పుర స్కరించుకుని మత పెద్దలతో సమావేశం నిర్వ హించారు. మత సామరస్యానికి వనపర్తి ప్రతీ కగా నిలుస్తూ వస్తోందని తెలిపారు. వచ్చే నెల బక్రీద్‌, హనుమాన్‌ జయంతి పండుగలు రాను న్నాయని, మత పెద్దలు వారి పర్యవేక్షణలో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా నిర్వహిం చుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రా ల నుంచి వచ్చే పశువుల అక్రమ రవాణాకు పశుసంవర్ధక శాఖ సిబ్బందితో కలిసి జిల్లా మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పశువులు రవాణా చేసే ప్రతీ వాహ నానికి సంబంధించిన పత్రాలు చూయించిన త ర్వాతనే అనుమతిస్తారని తెలిపారు. కొందరు చ ట్టాన్ని చేతిలోకి తీసుకుని శాంతిభద్రతలకు వి ఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఇ తర మతాలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచ డం జరిగిందని తెలిపారు. సమావేశంలో డీఎ స్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటే శ్వర్లు, సీఐ కృష్ణయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, పశువైద్యశాఖ ఏడీ మీరజ్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

భావి సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

వనపర్తి విద్యా విభాగం: భావి సమాజ నిర్మాతలు నేటి ఉపాధ్యాయులని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల వృత్యంతర శిక్షణలో భాగంగా రెండవ రోజు బుధవారం ఏహెచ్‌టీయూ, సఖి, భరోసా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కా ర్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్‌ నేరాల గు రించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగా హన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Updated Date - May 21 , 2025 | 11:07 PM