సకాలంలో ఎరువులు అందించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:30 PM
రైతులకు అవసరమైన ఎరు వులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
- గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రైతులకు అవసరమైన ఎరు వులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమా వేశంలో వ్యవసాయశాఖ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో నిలువ ఉన్న 543 మెట్రిక్ టన్నుల యూరియాను అవస రం ఉన్న రైతులకు పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా జిల్లాకు వచ్చే యూరియా నిల్వలను పీఏసీఎస్‌ల ద్వారానే రైతులకు అందజేయాలని సూచించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 600 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా విక్రయిచినా కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎరు వులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు.