Share News

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో

ABN , Publish Date - May 15 , 2025 | 10:42 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యంను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రాస్తారోకో చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ   రైతుల రాస్తారోకో
బాదేపల్లి పత్తి మార్కెట్‌ ఎదుట రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు

జడ్చర్ల, మే 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యంను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రాస్తారోకో చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. బాదేపల్లి పత్తి మార్కెట్‌లోని రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి జడ్చర్ల మండలం లోని గంగాపురం, ఆల్వాన్‌పల్లి, నెక్కొండ, పోలేపల్లి, పోలేపల్లితండా తదితర ప్రాంతా ల నుంచి రైతులు ధాన్యంను విక్రయించేందుకు తీసకువచ్చారు. కాగా తేమ శాతం అధికంగా ఉందంటూ కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉన్న వాటిని కొనుగోలు చేయకపోవడం, తూకం వేసిన బస్తాలను లిఫ్టింగ్‌ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి మార్కెట్‌ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై దాదాపు అరగంట పాటు రాస్తారోకో చేపట్టారు. సంఘ టన స్థలానికి జడ్చర్ల ఎస్‌ఐ జయప్రసాద్‌ చేరుకుని రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా ఉన్నత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాదేపల్లి పత్తి మార్కెట్‌లోని వరి కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యా న్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్‌మిల్లుల వద్ద బస్తాకు 2కిలోల కోత విధిస్తున్న తీరుపై సైతం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరా రు. రైతులు రాస్తారోకో చేపట్టిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆల్వాల్‌రెడ్డి పత్తి మార్కెట్‌కు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. సాయంత్రంలోగా ధాన్యంను కొనుగోలు చేయడంతో పాటు ఇదివరకే తూకం వేసిన బస్తాలను రైస్‌మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపడ్తామన్న అధికారుల హామీ మేరకు రైతులు శాంతించారు.

Updated Date - May 15 , 2025 | 10:42 PM