రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:17 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందు కోసం కృతనిశ్చయంతో పని చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి
భూత్పూర్/దేవరకద్ర/చిన్నచింతకుంట, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందు కోసం కృతనిశ్చయంతో పని చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట మండలాల (ఎంపిక చేసిన రైతులకు) కంది, జొన్న, వరి, సీడ్స్ విత్తనాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ ప్రకారం భూత్పూర్ మండలంలో రైతుబీమా కింద రూ.1.90 కోట్లు, రైతు భరోసా కింద రూ.10.948 కోట్లు రైతు ఖాతాల్లో జమచేయడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రుణమాఫీ కింద నియోజవర్గంలో రూ.8.94 కోట్లు, బోనస్ కింద రూ.3.75 కోట్లు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పద్మ పాల్గొన్నారు. అంతకుముందు దేవరకద్ర రైతు వేదిక వద్ద దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు చెందిన రైతులకు కంది, జొన్న, వరి విత్తనాలను పంపిణీ చేశారు.మార్కెట్ చైర్మన్ కతలప్ప, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షులు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షారుక్‌అలీ, ఏవో రాజేందర్ అగర్వాల్ పాల్గొన్నారు. అదే విధంగా చిన్నచింతకుంట మండలం ఎదులాపూర్‌లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో అధికారులతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు చిన్నచింతకుంట మండలానికి చెందిన ఆదర్శ రైతులకు వ్యవసాయ శాఖ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వ విద్యాలయం ప్రత్యేకంగా వృద్ధి చేసిన కంది, జొన్న, వరి సీడ్‌ను పంపిణీ చేశారు.