మక్కలు కొనాలని రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:03 PM
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదంటూ మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఎకరాకు 18.5 క్వింటాళ్లు కొనేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు
- 25 నుంచి 30 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
- ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తాం : మార్క్‌ఫెడ్ డీఎం
కొల్లాపూర్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదంటూ మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన మొక్క జొన్న కొనుగోలు చేయడం లేదని సోమవారం కొల్లాపూర్ పట్టణంలో రొడ్డెక్కి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పండించిన రైతులకు క్వింటా లు మొక్కజొన్నకు రూ. 2,400, మద్ధతు ధర ప్రకటించింది. అదే విధంగా ఎకరాకు 18.5 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 18.5 క్విం టాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా మొక్కజొన్న ఏం చేసుకోవాలని అధికారుల ను నిలదీశారు.
నిలిచిన రాకపోకలు
రైతుల రాస్తారోకోతో గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు, వ్యవసాయ అధికారు లు రాస్తారోకో వద్దకు చేరుకొని రైతులతో చర్చించారు. కలెక్టర్ ఆదేశానుసారం రెం డు రోజుల్లో రైతులకు పూర్తి సమాచారం అందజేస్తామని పేర్కొనడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఇదిలా ఉండగా కొల్లాపూర్ మార్కెట్ యార్డుకు 40 రోజుల క్రితం వివిధ గ్రామాల నుంచి మొక్క జొన్న పంటను తీసుకువచ్చి ఆరబెట్టుకు న్నామని, కొనుగోలు చేసే వారే లేరని, వారం క్రితం సింగిల్‌విండో సొసైటీ ఆధ్వ ర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించినా నేటికీ ఒక్క గింజ కొనుగో లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీస వసతులు కల్పించలేని సింగిల్‌విండో సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.