వేరుశనగ విత్తనాలు ఇస్తలేరని రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:28 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డె క్కారు.
పాన్‌గల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డె క్కారు. వివిధ గ్రామాల రైతులు గురువా రం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య యాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్‌లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూనె ఉత్పత్తులను పెంపొం దించేందుకు రైతులకు ఉచితంగా వేరు శనగ విత్తనాలను పంపిణీ చేస్తోంది. అవసరం ఉన్న రైతులందరికీ ఉచితంగా వేరుశనగ విత్తనాలను అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్న వారికి లెక్కకు మించి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం సరికాదన్నారు. మండల వ్యవసాయ అధి కారి మణిచందర్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి రాస్తారోకో వద్దకు వచ్చి రైతుల తో మాట్లాడారు. గోదాంలో స్టాక్ లేకపో వడం వల్ల రైతులకు విత్తనాలను పంపిణీ చేయడం లేదని, ప్రభుత్వం నుంచి కోటా వస్తే పంపిణీ చేస్తామని ఏఓ తెలిపారు. అవసరమున్న రైతులందరికీ వేరుశనగ విత్తనాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు వినతి పత్రం అందించి రాస్తా రోకో విరమించారు.