పేట-కొడంగల్ ఎత్తిపోతలతో రైతులకు నష్టం
ABN , Publish Date - May 15 , 2025 | 10:57 PM
పేట-కొడంగల్ ఎత్తిపోతలతో నియోజకవర్గ రైతులకు అపార నష్టం జరిగే అవకాశం ఉందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, మే 15 (ఆంధ్రజ్యోతి): పేట-కొడంగల్ ఎత్తిపోతలతో నియోజకవర్గ రైతులకు అపార నష్టం జరిగే అవకాశం ఉందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక టీఎంసీ సామర్థ్యం ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పది రిజర్వాయర్లకు నీటిని ఎలా చేరవేస్తారన్నారు. కేవలం నీటిని పైపులైన్ల ద్వారా తరలించడం ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. మక్తల్ నియో జకవర్గ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు త్వరలో ఈ ప్రాంత రైతులతో కలిసి ఉద్యమిస్తా మన్నారు. పోలీస్ బందోబస్తుతో పనులు చేస్తూ ఈ ప్రాంత రైతులను భయాందోళనకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. మక్తల్ నియోజకవర్గ రైతులను విస్మరిస్తూ కొడంగల్‌కు నీటిని తరలించడాన్ని ఆయన తప్పుపట్టారు. పనులు ప్రారంభించకముందే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీకి రూ.100 కోట్ల బిల్లులు పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూత్పూర్ జలాశయం కింద ఈ ప్రాంత ఆయకట్టుకు ఎంతవరకు నీరందిస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో శ్రీనివాస్‌గుప్తా, రాజేష్‌గౌడ్ చిన్న హన్మంతు, అన్వర్ హుసేన్, గాల్‌రెడ్డి, జగ్గలి రాములు, మన్నాన్, జుట్ల శంకర్, సాగర్, మొగిలప్ప తదితరులున్నారు.