Share News

రైతులు ఆందోళన చెందొద్దు

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:13 PM

తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, రైతులు ఎవరూ ఆందోళన చెం దోద్దని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి భరోసా ఇచ్చారు.

రైతులు ఆందోళన చెందొద్దు
తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

- ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెద్దమందడి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, రైతులు ఎవరూ ఆందోళన చెం దోద్దని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం కురిసిన వర్షానికి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రా మంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలిం చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగో లు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం బలిజపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. బిల్లులు సకాలంలో వస్తున్నాయా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకు న్నారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న తమకు ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేశ్‌గౌడ్‌, బాల రాజు, మల్లేశ్‌, నరసింహ, యాదగిరి, సురేం దర్‌గౌడ్‌, వేణుగౌడ్‌, మన్యం, బుచ్చన్న తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:13 PM