Share News

రైతులు యాజమాన్య పద్దతులు పాటించాలి

ABN , Publish Date - May 13 , 2025 | 11:05 PM

రైతులు వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్గే మంచి లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి బొవ్వళ్ల వెంకటేశ్‌ అన్నారు.

రైతులు యాజమాన్య పద్దతులు పాటించాలి
భూత్పూర్‌లో ఓ విత్తన విక్రయ దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న డీఏవో

- జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్‌

భూత్పూర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : రైతులు వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్గే మంచి లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి బొవ్వళ్ల వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి పాల్గొని, మాట్లాడారు. ప్రస్తుత వేసవి కాలంలో రైతులు దుక్కులను లోతుగా దున్నుకోవాలని, ఎరువులు, విత్తనాలు కొనే విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యాజమాన్య పద్దతులు పాటించేటప్పుడు సరైన విధానంలో వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తే రైతులు నష్టాలు లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. రైతులు అనుమతి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని, గ్రామాల్లో లూజు విత్తనాలు అమ్మే వారివద్ద ఎట్టి పరిస్ధితుల్లో కొనుగోలు చేయరాదన్నారు. బీజీ త్రీ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనరాదని, ఎక్కడైన ఆ విత్తనాలు అమ్మితే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

రోహీణి కార్తీలోనే వరి నాట్లు వేసుకోవాలని, దాని ద్వారా పంటల దిగుబడి బాగుంటుందన్నారు. ప్రతీ రైతు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. రైతులు ఏఈవోల వద్ద భూములకు సంబంధించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని వివిధ విత్తన విక్రయ కేంద్రాల్లో రికార్డులను, విత్తనాలు పరిశీలించారు. ఏవో మురళిధర్‌, ఏఈవోలు, రైతులు, పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:05 PM