అధికారి నిర్లక్ష్యంతో అందని రైతుబీమా పరిహారం
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:25 PM
వ్యవసాయ విస్తరణ అధికారి నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు కుటుంబం రైతుబీమా పరిహారానికి దూరమైంది. ఈ పరిస్థితికి కారణమైన అధికారిపై సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్‌కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది.
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
గద్వాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విస్తరణ అధికారి నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు కుటుంబం రైతుబీమా పరిహారానికి దూరమైంది. ఈ పరిస్థితికి కారణమైన అధికారిపై సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్‌కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. అయిజ మండలం తూముకుంట గ్రామానికి చెందిన కే.పరశురాముడికి సర్వే నెం.23లో 14గుంటల భూమిఉంది. 2018లో రైతుబీమా, రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నాడు. రైతుబంధు పడుతుంది. రైతు బీమా కూడా కొనసాగుతుందని భా వించాడు. ఆయన గతనెల 20న అ నారోగ్యంతో చనిపోయాడు. రైతుబీమా కోసం భార్య కే.శారద దరఖాస్తు చేసుకుంది. పరిశీలించిన వ్యవసాయ అధి కారులు దరఖాస్తు చేసుకోలేదని తిరస్కరించారు. అంతేకాకుండా రైతు గ్రామంలో నివశించడం లేదని సంబందిత అధికారులకు నోట్‌పెట్టారు. రైతుబీమాకు దరఖాస్తు ఇస్తే దానిని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయలేకపోవడం వలనే తన భర్త బీమా క్లైయిమ్ రావడం లేదని భార్య శారద ఆరోపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యమే కాకుండా తాము గ్రామంలో నివసించడం లేదని చెప్ప డం అబద్ధమని విచారణ చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఏఈవో నిర్ల క్ష్యం కారణంగా తన భర్త మరణానికి రావాల్సిన క్లైయిమ్‌ను కోల్పోయానని ఆయనపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు, తన ముగ్గురు పిల్లలకు ఆసరా లేకుండా పోయిందని ఆమె వాపోయారు.