రైతుల కష్టాలు తీరాయి
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:35 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతుల కష్టాలు తీరుతున్నాయని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు అన్నారు.
- పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి సాగు నీరు విడుదల
కొల్లాపూర్, జూలై8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతుల కష్టాలు తీరుతున్నాయని పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు అన్నారు. పంటలకు సకాలం లో సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నా రు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మం డల పరిధిలోని ఎల్లూరు గ్రామంలో రేగు మాన్ గడ్డ వద్ద మంగళవారం ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లో ఒకటవ మోటార్‌ను కంప్యూటర్ ద్వారా ఆన్ చేసి సాగు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, ఇరిగేషన్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారా యణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ప్రాజె క్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవా లని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. వారే ఇప్పుడు ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రైతు లకు అన్ని విధాలా న్యాయం జరుగుతుం దని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. అంతకుముం దు ఎంజీకే ఎల్‌ఐ ద్వారా విడుదలైన వరద నీటికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పూలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, చంద్రశేఖర్, మురళి, డీఈ లోకిలాల్, ఏఈ సంతోశ్ తది తరులు పాల్గొన్నారు.