Share News

జిల్లాలో ఉత్సాహంగా రైతు సంబురాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:24 PM

రైతు భరోసాను ఖరీఫ్‌ సాగుకు ముందే రైతుల ఖాతాలలో జమ చేసి వారిలో సంతోషాన్ని నింపామని సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు.

జిల్లాలో ఉత్సాహంగా రైతు సంబురాలు
పూడూరులో సీఎం ప్రసంగాన్ని వింటున్న అధికారులు, రైతులు

- జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల/గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాను ఖరీఫ్‌ సాగుకు ముందే రైతుల ఖాతాలలో జమ చేసి వారిలో సంతోషాన్ని నింపామని సీఎం రేవంత్‌రెడ్డి అ న్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడి యో కాన్ఫెరెన్స్‌ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి రైతు వేదికలలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతు సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రభు త్వం తొమ్మిది రోజుల్లో తొమ్మిదివేల కోట్ల రూ పాయలను రైతుల ఖాతాలలో జమచేసి వారి లో ఆనందాన్ని నింపిందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రైతు లు వ్యవసాయ పనుల కోసం రైతు భరోసా సా యం వారిని ఆర్ధికంగా బలోపేదం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో 9 రోజులలో 1,65,336మంది రైతుల ఖాతాలలో రూ.244.65 కోట్లను పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు పంటల దిగుబడికి రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో ఎంతో ఉప యుక్తంగా ఉందన్నారు. రైతు విజయోత్సవ కా ర్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జి ల్లావ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా హాజరై సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈకార్యక్రమంలో డీఏవో సక్రియా నాయక్‌, ఏడీ సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:24 PM