Share News

వేరుశనగ విత్తన బస్తాలను ఎత్తుకెళ్లిన రైతులు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:29 PM

వేరుశనగ ఉచిత విత్తనాల పంపిణీ వ్యవసాయ అధికారులకు తలనొప్పిగా మారింది. దామరగిద్ద సింగిల్‌ విండో వద్ద సోమవారం చేపట్టిన విత్తనాల పంపిణీ సందర్భంగా 60 బస్తాలను రైతులు ఎత్తుళ్లగా, తోపులాటలో ఒక రైతు కాలు విరిగింది.

వేరుశనగ విత్తన బస్తాలను ఎత్తుకెళ్లిన రైతులు
టోకెన్ల కోసం రైతు వేదిక వద్ద గుమి గూడిన రైతులు

ఉచితంగా అందించేందుకు గ్రామానికి పలువురి ఎంపిక

ఎంపిక చేయని రైతులూ దామరగిద్ద సింగిల్‌విండోకు రాక

తమకు దొరుకుతాయో లేదోనని 60 బస్తాలు ఎత్తుకెళ్లిన అన్నదాతలు

దామరగిద్ద, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ ఉచిత విత్తనాల పంపిణీ వ్యవసాయ అధికారులకు తలనొప్పిగా మారింది. దామరగిద్ద సింగిల్‌ విండో వద్ద సోమవారం చేపట్టిన విత్తనాల పంపిణీ సందర్భంగా 60 బస్తాలను రైతులు ఎత్తుళ్లగా, తోపులాటలో ఒక రైతు కాలు విరిగింది. వేరుశనగ సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందిస్తుందని వ్యవసాయ అధికారులు ముందుగానే గ్రామాలలో కొంత మంది రైతుల పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసిన రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నారని తెలియడంతో వారితో పాటు పేర్లు నమోదు కాని వారు కూడా అధిక సంఖ్యలో దామరగిద్ద సింగిల్‌ విండో కార్యాలయానికి తెల్లవారుజామున 4 గంటలకే వచ్చారు. రైతులు అధికంగా రావడంతో పోలీసులను పిలిపించి, టోకెన్లు ఇచ్చి పంపిణీ చేయాలని ఏవో, ఏ ఈవో పోలీస్‌ స్టే షన్‌కు వెళ్లారు. అ యితే అప్పటికే విండో కార్యాల యం నుంచి విత్తనాలు తీసుకెళ్లినట్లు కొన్ని విత్తనాలు కిందపడ్డాయి. వాటిని గమనించిన రైతులు ఎక్కడికి తీసుకెళ్లారని అడుగగా, కాన్‌కుర్తి క్లస్టర్‌కు తీసుకెళ్లామని చెప్పారు. దాంతో తమకు విత్తనాలు దొరుకుతాయో లేదోనని కొంత మంది రైతులు ప్రహరీ లోపలికి దూసుకెళ్లి, షట్టర్‌ పైకి లేపి, దాదాపు 60 బస్తాల వరకు విత్తనాలు ఎత్తుకెళ్లినట్లు ఏవో మణిచందర్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు, ఎస్‌ఐ రాజు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం టోకెన్లు ఇచ్చి, పోలీసు బందోబస్తు మధ్య విత్తనాలు పంపిణీ చేశారు. అంతకు ముందు తోపులాటలో న ర్సాపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటప్ప కింద పడి, కాలు విరిగింది. అ తడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రైతుల రాస్తారోకో..

వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు నారాయణపేట, మద్దూరు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. విత్తనాలు రాత్రికి రాత్రి కానుకుర్తికి ఎందుకు పంపించారని అధికారులను నిలదీశారు. ఎస్‌ఐ రాజు అక్కడికి చేరుకుని, రైతులను శాంతింపజేశారు.

డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌కు స్వాగతం పలుకుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

Updated Date - Sep 22 , 2025 | 11:29 PM