Share News

భూ భారతితో రైతులకు ప్రయోజనం

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:26 PM

భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ అన్నారు.

భూ భారతితో రైతులకు ప్రయోజనం
వెల్దండలో భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్న అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

కల్వకుర్తి/వెల్దండ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పద్మశాలి కల్యాణ మండ పంలో తహసీల్దార్‌ ఇబ్రహీం అధ్యక్షతన భూ భారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా భూభారతి చట్టానికి సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిం చారు. అదే విధంగా వెల్దండ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన కల్పించా రు. జూన్‌ 2 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ఫిర్యాదులు కూడా స్వీకరిస్తామని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, ఎంపీడీవో ఎన్‌.వెంకట్రాములు, వెల్దం డ తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:26 PM