Share News

సీఎం సహాయ నిధికి రైతు భరోసా

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:11 PM

తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతు భరోసా నగదును ఓ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

సీఎం సహాయ నిధికి రైతు భరోసా
కలెక్టర్‌కు రైతుభరోసా నగదును విరాళంగా ఇస్తున్న కోయిలదిన్నెవాసి

- కలెక్టర్‌కు అందించిన రైతు లక్ష్మీకాంతరెడ్డి

వడ్డేపల్లి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన రైతు భరోసా నగదును ఓ రైతు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా, కోయిలదిన్నెకు చెందిన గోరంట్ల లక్ష్మీకాంతరెడ్డికి రైతు భరోసా కింద రూ.95,400 ఆయన ఖాతాలో జమ అయ్యాయి. ఈ డబ్బును ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కులను సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సంతోష్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయనను కలెక్టర్‌ అభినందించారు. ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ ఫలాలను తిరిగి అందించాలన్న ఆయన దృక్ఫ థం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:12 PM