Share News

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:22 PM

విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన గండీడ్‌ మండలం పరుగుల తాండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..

విద్యుదాఘాతంతో రైతు మృతి
జేమ్లా నాయక్‌(ఫైల్‌)

గండీడ్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన ఘటన గండీడ్‌ మండలం పరుగుల తాండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన జేమ్లా నాయక్‌(60) అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడేందుకు రోజూ రాత్రి పొలానికి వెళ్లి గుడిసెలో నిద్రపోయేవాడు. కొందరు రైతులు అడవి పందుల నుంచి పంటను కాపాడేందుకు పొలాల చుట్టూ విద్యుత్‌ షాక్‌ ఏర్పాటు చేశారు. అది గమనించని జేమ్లా నాయక్‌ విద్యుత్‌ వైర్లు తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనుమానం రాకుండా చుట్టు పక్కల రైతులు అతన్ని తీసుకొచ్చి గుడిసెలో పడుకోబెట్టారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 08 , 2025 | 11:22 PM