జీపీవోలుగా వెళ్తున్న ఉద్యోగులకు వీడ్కోలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:06 PM
గ్రామపరిపాలన అధికారులుగా వెళ్తున్న ఉద్యోగులకు గురువారం జడ్చర్ల మునిసిపాలిటీలో ఘనంగా వీడ్కోలు పలికారు.
జడ్చర్ల/భూత్పూర్ సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : గ్రామపరిపాలన అధికారులుగా వెళ్తున్న ఉద్యోగులకు గురువారం జడ్చర్ల మునిసిపాలిటీలో ఘనంగా వీడ్కోలు పలికారు. మునిసిపాలిటీలో వార్డు అధికారులుగా పనిచేస్తున్న నర్సిములు, కృష్ణయ్య, రాంమోహన్‌రావు, శివకుమార్‌లు గ్రామీణ వ్యవస్థలో భాగంగా పునరుద్ధరించిన గ్రామపరిపాలనా అధికారులుగా నియమించబడ్డారు. వీరికి మునిసిపల్ కార్యాలయంలో శాలువా, పూలమాలతో సత్కరించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్‌లు ప్రశాంత్‌రెడ్డి, కుమ్మరి రాజు పాల్గొన్నారు. భూత్పూర్ మునిసాపాలిటీలో వార్డు అధికారులుగా పని చేస్తున్న వెంకట్‌రెడ్డి, రమేష్, ఆంజనేయులు గోపాల్, సైయిదమ్మ, కుర్మయ్య, కేశవులు, చంద్రశేఖర్, బుచ్చమ్మ, పార్వతమ్మ జీపీవోలుగా బదిలీపై వెళ్తుండగా మునిసిపల్ కమిషనర్ నురూల్ నజీబ్, కాంగ్రెస్ పట్ణణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్ ఘనంగా సన్మానించారు.
జీపీవోలు ఆదర్శంగా నిలవాలి..
నవాబ్‌పేట : నూతనంగా నియమితులైన జీపీవోలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఫిర్యాదులు క్షణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. తహసిల్దార్ శ్రీనివాస్, డీటీ సువర్ణ, నూతనంగా నియమితులైన జీపీవోలను అభినందించారు.