ఓర్వలేకనే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:26 PM
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల్లో పెరిగిన అ భిమానాన్ని ఓర్వలేకనే ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హను మంతునాయుడు ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు
సీబీఐ విచారణ నిర్ణయంపై బీఆర్‌ఎస్ ధర్నా
గద్వాలటౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను సద్వినియోగమయ్యేలా చే పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల్లో పెరిగిన అ భిమానాన్ని ఓర్వలేకనే ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హను మంతునాయుడు ఆరోపించారు. ఇందులో కాం గ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు. కాళేశ్వరం వ్యవహా రంపై విచారణ జరిపే బాధ్యతను సీబీఐకి అ ప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఖబడ్దార్ రేవంత్.. అని నినాదాలు చేస్తూ మంగళవారం పట్టణంలోని కృష్ణవేణి సర్కిల్ వద్ద పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టా రు. ఈ సందర్బంగా మాట్లాడిన హనుమంతు నాయుడు, కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను రాజకీయం గా ఎదుర్కొనే శక్తిలేకనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గోస్ కమిషన్ పేరుతో సరికొత్త నాటకానికి తెర తీసిందన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదకి ఏకపక్షంగా తప్పులతడకగా ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ర్టానికి గర్వకారణంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఎన్ని కు తంత్రాలు పన్నినా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాగర్‌దొ డ్డి వెంకట్రాములు, చక్రధర్‌రావు, మోనేష్, రాఘవేంద్రరెడ్డి, అతిక్‌ఉర్ రెహమాన్, శ్రీనివాస్ గౌడ్, రాజారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్‌నాయుడు, భరత్‌సింహారెడ్డి, రామునాయుడు, చక్రధర్‌రెడ్డి, శ్రీరాములు ఉన్నారు