Share News

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:31 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ధాన్యం కొనుగోలు విష యంలో రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపా రు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ధాన్యం కొనుగోలు విష యంలో రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపా రు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగే శ్వర్‌రావు, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వ హించారు. నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ నుంచి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోం దని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోలు కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అంతకు ముందు అదనపు కలెక్టర్లు పి.అమరేందర్‌, దేవసహాయం తో కలిసి ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిం చారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఈవీఎం గోదామును కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్‌ బందోబస్తు తీరును గమనించి సంబంధింత అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Nov 10 , 2025 | 11:31 PM