Share News

పూడ్చిన మృతదేహం వెలికితీత

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:15 PM

త మ్ముడి మృతిపై అనుమానం ఉందని, మాకు న్యాయం కావాలంటూ అన్న పోలీసులకు ఫిర్యా దు చేయడంతో రెండు నెలల క్రితం పూడ్చి పె ట్టిన మృతదేహాన్ని తహసీల్దార్‌ సమక్షంలో వైద్య బృందం పోస్టుమార్టం చేశారు.

పూడ్చిన మృతదేహం వెలికితీత
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న వైద్య బృందం

- మృతిపై అనుమానం ఉన్నదని రెండు నెలల తర్వాత సోదరుడి ఫిర్యాదు

- పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు

భూత్పూర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : త మ్ముడి మృతిపై అనుమానం ఉందని, మాకు న్యాయం కావాలంటూ అన్న పోలీసులకు ఫిర్యా దు చేయడంతో రెండు నెలల క్రితం పూడ్చి పె ట్టిన మృతదేహాన్ని తహసీల్దార్‌ సమక్షంలో వైద్య బృందం పోస్టుమార్టం చేశారు. ఈ ఘటన గురువారం మహబూ బ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చం ద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కప్పెట గ్రామానికి చెందిన పొనగంటి సంతోష్‌(30) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తు న్నాడు. సంతోష్‌ భార్య కొన్ని నెలల క్రితం వదిలేసి వెళ్లింది. వీరికి పదే ళ్ల బాలుడు ఉన్నాడు. కుమారుడితోపాటుగా తల్లి బుగ్గమ్మతో కలిసి సంతోష్‌ జీవిస్తున్నాడు. ఈ తరుణంలో జూలై 29వ తేదీన అదే గ్రా మానికి చెందిన వడ్డేయాదయ్య అనే వ్యక్తి రాజేశ్వర్‌రెడ్డి కూలీకి పిలు స్తున్నాడని చెప్పి సంతోష్‌ను తీసుకెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం సం తోష్‌కు మూర్చ వచ్చి కింద పడిపోయాడని సంతోష్‌ అన్న ఆంజనే యులుకు వడ్డేయాదయ్య ఫోన్‌ చేసి చెప్పాడు. ఆంజనేయులు అందు బాటులో లేకపోవడంతో తన రెండవ తమ్ముడైన శ్రీనుకు తమ్ముడు కింద పడ్డాడని ఇంటి వెళ్లి చూడమని చెప్పాడు. ఇంతలోనే సంతోష్‌ చ నిపోయినట్లుగా శ్రీనుకు తెలిసింది. అయితే మరుసటి రోజు మృ తదేహాన్ని వారి సొంత పొలంలో పూడ్చి పెట్టారు. అయితే మా తమ్ము డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, అన్న శ్రీనివాసులు సె ప్టెంబరు 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం స్థాని క తహసీల్దార్‌ కిషన్‌ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి జిల్లా వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న ట్లుగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - Oct 09 , 2025 | 11:15 PM