ఉత్సాహంగా కుక్కల పరుగు పోటీలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:21 PM
మండలంలోని బల్గెరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా ఆదివారం కుక్కల పరుగు పోటీలు నిర్వ హించారు.
గట్టు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బల్గెరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా ఆదివారం కుక్కల పరుగు పోటీలు నిర్వ హించారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు శ్యామ ల పోటీలను ప్రారంభించారు. పులికల్ రాజేంద ర్‌కు చెందిన శునకం మొదటి విజేతగా నిలువడంతో రూ.పదివేల నగదు అందజేశారు. వడ్డేవాట బడేసాబ్‌కు చెందిన శునకం రెండో విజేతగా నిలువగా రూ.ఐదువేలు, బల్గెర హన్మంతు గౌడు శునకం మూడో విజేతగా నిలువడంతో రూ.మూడువేలు అందజేశారు. విజేతలకు బ హుమతులను బాసు గోపాల్ అందించారు.