ఉత్సాహంగా నెట్‌బాల్ జట్ల ఎంపికలు
ABN , Publish Date - May 13 , 2025 | 11:11 PM
జనగాంలో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న 4వ ఫాస్ట్-5 తెలంగాణ సబ్ జూని యర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలను మంగళవారం స్థానిక స్టేడియం మైదానంలో నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌స్పోర్ట్స్, మే 13 (ఆంధ్రజ్యోతి): జనగాంలో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న 4వ ఫాస్ట్-5 తెలంగాణ సబ్ జూని యర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలను మంగళవారం స్థానిక స్టేడియం మైదానంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని నెట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విక్రమాదిత్యరెడ్డి, ఖాజాఖాన్ ప్రారంభించారు. వారు మా ట్లాడుతూ.. నాలుగు జిల్లా జట్ల క్రీడాకారులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి, ప్రతి భ కనబరిచిన వారిని తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. క్రీడాకా రులకు అసోసియేషన్ అండగా ఉంటుందని, జిల్లాలో నెట్‌బాల్ క్రీడాభివృద్ధికి కృ షి చేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సాదత్‌ఖాన్, అంజద్, షరీఫ్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.