Share News

అంతా మా ఇష్టం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:02 PM

మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది.

 అంతా మా ఇష్టం
నిల్వ చేసిన కృత్రిమ ఇసుక (ఫైల్‌)

- జోరుగా ఇసుక అక్రమ రవాణా

రాజాపూర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా.. ఇసుక అక్రమార్కులు అంతా మా ఇష్టం అంటూ దుందుభీ వాగును కొల్లగొడుతూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ సమీపంలోని దుందుభీ వాగులో, రాయపల్లి, చెన్నవెళ్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రతీ రోజు 30 నుంచి 40 టిప్పర్లతో హైదరాబాద్‌, జడ్చర్ల పట్టణం, పోల్లేపల్లి సెజ్‌లకు ఇసుకను తరలిస్తున్నా అటు మైనింగ్‌, ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ గ్రామంలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసిన మట్టి కుప్పను సైతం కృత్రిమ ఇసుక తయారు చేస్తన్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మండలంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

జరిమానా విధిస్తున్నాం..

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై తమ సిబ్బంది ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. వాల్టా చట్టానికి పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో ఆపటు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తున్నాం.

- రాధాకృష్ణ, తహసీల్దార్‌

Updated Date - Sep 13 , 2025 | 11:02 PM