చివరి విడతకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:31 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది.
68 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది
పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
గద్వాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలకు, 700 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ఏడు గ్రామ పంచాయతీలు, 139 వా ర్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 68 గ్రామ పంచాయతీల్లోని 561 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 246 మంది సర్పం చుల కు, 1,096 మంది వార్డుసభ్యుల కోసం పోటీ ప డుతున్నారు. మొత్తం 1,00,372 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇం దులో పురుషులు 49,393, మహిళలు 50,976 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. వీరికి 638 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పీఓలుగా 638మంది ఓపీఓలుగా 792 మందిని నియమించారు. ఆయామండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లతో వారికి కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు.