నీట్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 03 , 2025 | 11:10 PM
ఎంబీబీఎస్, బీడీఎస్, అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించనున్న నీట్(నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) 2025 పరీక్షలకు అధికారులు సర్వ సిద్ధం చేశారు.
జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 4,454 మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, మే 3(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్, బీడీఎస్, అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించనున్న నీట్(నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) 2025 పరీక్షలకు అధికారులు సర్వ సిద్ధం చేశారు. పరీక్షకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 11, జడ్చర్ల, హన్వాడలలో ఒక్కోటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుంది. 4,454 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉ దయం 11 గంటల నుంచే అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత అనుమతించరు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి, బయోమెట్రిక్ తీసుకొని కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలు పాటించాలి. ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించకూడదు. ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో తే వాలి. గుర్తింపు కోసం ఆధార్‌కార్డు, డ్రై వింగ్ లైసెన్స్, కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు లేదంటే ఇతర ఏదో ఒకటి ఫొటోతో ఉన్నకార్డు తప్పని సరిగా తేవాలి. పెన్ను కేంద్రంలోనే ఇస్తారు. నిర్వహణకు 20 మంది పరిశీలకులు, 372 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.