Share News

అంతా రామమయం

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:48 PM

ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా కోయిలకొండలోని స్వయంభూ శ్రీరా మపాద క్షేత్రం శ్రీరామకొండ ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

అంతా రామమయం
శ్రీరామకొండ ఆలయానికి బారులు తీరిన భక్తులు

- శ్రీరామకొండకు పోటెత్తిన భక్తులు

- తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులు

కోయిలకొండ/చిన్నచింతకుంట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా కోయిలకొండలోని స్వయంభూ శ్రీరా మపాద క్షేత్రం శ్రీరామకొండ ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శనివారం రాత్రి ఉమ్మడి పాల మూరు జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భజన భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము న 3 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన భక్తులు రామపాద దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. దర్శనం చేసుకొన్న భక్తులు కొండపై ఉన్న కోనేటి నీటితో పాటు వన మూలి కలను తమవెంట తీసుకువెళ్లారు. ఆలయ చైర్మన్‌ ఎస్‌.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ రత్నం, సీఐ గాంధీనాయక్‌, బీజేపీ నాయకుడు రతంగ్‌పాం డురెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కు మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రె డ్డితో పాటు బీజేపీ నాయకుడిఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు.

గోవింద నామస్మరణతో పులకించిన గిరులు

కురుమూర్తి క్షేత్రానికీ భక్తులు పెద్ద సంఖ్య లో పోటెత్తారు. దాంతో స్వామి వారి గిరులు గో వింద నామస్మరణతో మారుమోగాయి. జాతర మై దానం నుంచి రాజగోపురం గుండా, కాంచనగుహ వరకు క్యూలైన్‌లో కన్పించారు. ఉద్దాల మండపం వద్ద భక్తులతో కిటకిటలాడింది. అలాగే, అమ్మా పూర్‌ సంస్థానాధీశులైన రాజా శ్రీరామ్‌భూపాల్‌ స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:48 PM