Share News

ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచాలి

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:21 PM

మానవాళికి ప్రాణ వా యువునిచ్చి మనుగడని చ్చే మొక్కలను ప్రతీ ఒ క్కరు విరివిగా పెంచాలని వన పర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి పిలుపునిచ్చా రు.

  ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచాలి
ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయేంద్ర బోయితో కలిసి ఎకో పార్కులో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి రూరల్‌, జూలై9 (ఆంధ్రజ్యోతి): మానవాళికి ప్రాణ వా యువునిచ్చి మనుగడని చ్చే మొక్కలను ప్రతీ ఒ క్కరు విరివిగా పెంచాలని వన పర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి పిలుపునిచ్చా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చే పడుతున్న వన మహోత్స వం కార్యక్రమంలో భాగం గా బుధవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ఏకో పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్‌ ఇన్‌చార్జి విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ ఇన్‌చార్జి యాదయ్య, డీఎఫ్‌వో సత్యనారాయణతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణం సమతుల్యంగా ఉండడానికి 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని, కానీ వనపర్తి జిల్లాలో 18 - 19 శాతం మాత్రమే ఉందన్నారు. దీనిని 33 శాతానికి పెంచడానికి జిల్లాలోని ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వృక్షో రక్షితి రక్షితః అనే నానుడి ప్రకారం చెట్లను మనం కాపాడితే మనలను చెట్లు కాపాడతాయని కలెక్టర్‌ అన్నారు. వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం 21 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ ఇన్‌చార్జి యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది అందరూ పాల్గొని తలా ఒక మొక్కను నాటారు.

Updated Date - Jul 09 , 2025 | 11:21 PM