ప్రతీ ఏడాది.. ఆలస్యమే
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:27 PM
మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న చేపపిల్ల పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు.
- టెండర్లు పిలిచినా పంపిణీకి నోచుకోని చేప పిల్లలు
- ఎదురు చూస్తున్న మత్స్యకారులు
గద్వాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న చేపపిల్ల పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు. ప్ర భుత్వం టెండర్ల నిర్వహణను ఆలస్యం చేసిం ది. గతేడాది కూడా పంపిణీని ఆలస్యం చేయ డంతో చేపల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్లు వేశారు..
జిల్లాలో చేపపిల్లల పంపిణీకి ఇద్దరు కాం ట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇద్దరు వేయడంతో టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. కానీ ఫైనాన్షియ ల్ బిడ్‌ను తెరిచారు. బేరం మాత్రమే మిగిలిపోయింది. వారం రోజులుగా అధికారులు స్థా నిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్, ఓటర్ల జాబి తా శిక్షణ వంటి పనుల్లో బిజీ కారణంగా అధికారులకు సమయం కేటాయించలేదు.
జిల్లాలో 7వేల మంది మత్స్యకారులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 7వేల మంది మత్స్యకారులు ఉన్నారు. ముదిరాజ్‌లు అందరు దాదాపు వారి వృత్తిపైనే ఆధారపడి ఉన్నారు. జిల్లాలో 94మత్స్యకార సహకార సం ఘాలు ఉన్నాయి. జిల్లాలో 441 చెరువులు ఉ న్నాయి. ఇందులో 40పెద్ద చెరువులు, 375 మీ డియం, 26 చిన్న కుంటలు ఉన్నాయి. ఇవే కా కుండా ఎనిమిది రిజర్వాయర్లు కూడా ఉన్నా యి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లు జల కలను సంతరించుకోవడంతో మత్స్యకారులు చేపపిల్లలను ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎదు రు చూస్తున్నారు.
తూకం రావడం లేదు..
చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యమే అవుతోంది. ప్రతీ ఏడాది 1.69కోట్ల చేప పిల్లల పంపిణీ చేసేవారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం 90లక్షల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. అవి కూడా ఆలస్యంగా పంపిణీ చేస్తే ఎదగడానికి ఆరు నెలల సమయం పడుతోంది. ఆలోపు చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయి చేపలు తూకం రాక నష్టం వస్తోందని మత్స్య కారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.