ప్రతీ కూలీకి ఉపాధి పనులు కల్పించాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:21 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా అర్హు లైన ప్రతీ కూలీకి పని కల్పించాలని డీఆర్‌డీవో, అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు.
డీఆర్‌డీవో నర్సింగరావు
వడ్డేపల్లి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా అర్హు లైన ప్రతీ కూలీకి పని కల్పించాలని డీఆర్‌డీవో, అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. మండలంలోని కోయిదిన్నె, రామా పురం, జక్కిరెడ్డిపల్లె గ్రామాల్లో జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులతో పాటు పౌల్ర్టీ షెడ్, హార్టికల్చర్లను గురువారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భం గా అదనపు కలెక్టర్ ఆయాగ్రామాల్లో ఉపాధి కూలీల హాజరురిజిస్టర్లను పరిశీలించారు. కూ లీలకు ఎండ లేకుండా అన్నివసతులు కల్పించా లని, వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటు లో ఉంచాలని, ముఖ్యంగా నిర్ధేశించిన పనివే ళలకు అనుగుణంగా పనులు పూర్తి చేయించా లని మండలస్థాయి అధికారులకు సూచించా రు. ఉపాధి కూలీలకు సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కూలీని అందజేయాలన్నారు. గ్రా మాల్లో ఉపాధి పనులతో పాటు పౌల్ర్టీ షెడ్లు హార్టికల్చర్లకు సంబంధించిన పనులు త్వరితగ తిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అ సిస్టెంట్‌లు ఉన్నారు.