ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:12 PM
ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్ ఘని సూచించారు.
- జోగుళాంబ గద్వాల డీఈవో అబ్దుల్ ఘని
మానవపాడు, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో అబ్దుల్ ఘని సూచించారు. సోమవారం మండల పరిధిలోని బోరవెల్లి, జల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరుపట్టిక, విద్యా ర్థుల క్షమశిక్షణ, విద్య సామర్థ్యాలను పరిశీలిం చారు. పాఠశాలల్లోని సైన్స్‌లాబ్‌లు, తరగతి గ దులు, వంటశాలలు, మూత్రశాలలు, మరుగు దొడ్లను పరిశీలించారు. ప్రతీ విద్యార్థికి చదువు తోపాటు క్రమశిక్షణ ముఖ్యమని, ప్రైవేటుకు దీ టుగా విద్యాబోధన చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని, సబ్జెక్ ప్రకారం నేటికీ ఎంతవరకు పూర్తి చేశారని ఉపాధ్యాయులను అడిగి తెలు సుకున్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, సమయపాలన పాటిం చకుండా పాఠశాలకు హాజరైతే చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఎంఈవో శివప్రసాద్, ఉపాధ్యాయులు ఉన్నారు.