ప్రతీ రూపాయి విద్యకే ఖర్చు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:11 PM
విద్యానిధికి వచ్చే ప్రతీ రూపా యి పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తా మని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి - విద్యనిధికి రూ.7.50 లక్షలు టీజీవోల విరాళం
- మొదటి నెల వేతనం విద్యానిధికి అందజేసిన ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యానిధికి వచ్చే ప్రతీ రూపా యి పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తా మని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గెజి టెడ్ అధికారుల సంఘం, రాష్ట్ర ఉపాధ్య క్షుడు రామకృష్టగౌడ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో విద్యానిధికి 27 ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సేకరిం చిన రూ.7.50లక్షల విలు వైన చెక్కను కలెక్టర్ వి జయేందిర బోయికి అందజేశా రు. అలాగే ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ తన మొద టి నెల జీతం రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం కలె క్టర్ మాట్లా డుతూ వి ద్యా నిధి నిధు లతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా డిజిటల్ లె ర్నింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సా మాజిక బాధ్యతా భావించి విద్యానిధికి విరాళాలు ఇ చ్చిన టీజీవో ప్రతినిధులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభి నందించారు.
టీజీవో ఉపాధ్యక్షుడు రామకృష్ణగౌడ్ మాట్లాడారు. డీ సీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, రాష్ట్ర గజిటెడ్ అధి కారుల సంఘం సెంట్రల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, టీజీవో జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, కార్యదర్శి వరప్రసాద్, ట్రెజరర్ టైటస్ పాల్, ఉపాఽధ్యక్షుడు శ్రీనుగౌడ్, శశికాంత్, జిల్లా ట్రెజ రీ అధికారి శ్రీనివాస్, ఏటీవో తానాజీ, డీపీఆర్‌వో శ్రీనివా స్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, వ్యవసాయ శాఖ ఏడీ రామ్, వ్యవసాయ శాఖ ఏడీ రామ్‌పాల్ తదితరులు ఉన్నారు.