Share News

ప్రతీ రైతుకు పథకాలు అందేలా చూడాలి

ABN , Publish Date - May 10 , 2025 | 11:06 PM

జాతీయ ఉపాధి హామీ పఽథకం ద్వారా ప్రభుత్వం నియోజవర్గంలోని రైతులకు ఉపయోగపడే విధంగా 40 పశువుల పాకలు మంజూరు చేసింది.

ప్రతీ రైతుకు పథకాలు అందేలా చూడాలి
ఉపాధి హామీ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఉపాధి హామీ పఽథకం ద్వారా ప్రభుత్వం నియోజవర్గంలోని రైతులకు ఉపయోగపడే విధంగా 40 పశువుల పాకలు మంజూరు చేసింది. వాటిని అర్హులైన ప్రతీ రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం ఎంపీవోలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భూత్పూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజవర్గంలోని ఐదు మండలాల ఎంపీవోలతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా రూ.90 వేల వ్యయంతో నిర్మించే 40 పశువుల పాకలతో పాటు రూ.1.20 లక్షల వ్యయంతో 20 పౌలీ్ట్ర పౌమ్‌లు, రూ.5 లక్షల వ్యయంతో రెండు గొర్రెల షెడ్‌లు, ఐదు చెక్‌ డ్యాములు, నియోజవర్గంలో వివిధ గ్రామాల్లో 50 కిలో మీటర్ల వరకు ఫార్మేషన్‌ రోడ్లు (మట్టి) మంజూరు కావడం జరిగిందన్నారు. అంతే కాకుండా 150 ఎకరాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించనున్నట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే పశువుల పాకలు, పౌల్ర్టీ గొర్రెల పాంములు వంటి వాటికి కేటాయించిన నిధులు సరిపోవని, వాటిని పెంచాలే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, లిక్కి విజయ్‌గౌడ్‌, వివిధ మండలాలకు చెందిన ఎంపీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:06 PM