Share News

ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:11 PM

అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంత ఇంటిని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి అన్నారు.

ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు
లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిర బోయి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి

రాజాపూర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంత ఇంటిని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించిన రెండు ఇందిరమమ్మ ఇళ్లను ఎమ్మెల్యే, కలెక్టర్‌ విజయేందిర బోయి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అదే గ్రామంలో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, గోవర్ధన్‌ రెడ్డి, తహసీల్దార్‌ రాధాకృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీఓ వెంకట్‌ రాములు, రమణ, గోనేల రమేష్‌, శ్రీధర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:11 PM