Share News

17శాతం తేమ ఉన్నా.. దొడ్డు ధాన్యం కొనాల్సిందే

ABN , Publish Date - May 21 , 2025 | 11:21 PM

కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం 17శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు.

17శాతం తేమ ఉన్నా..  దొడ్డు ధాన్యం కొనాల్సిందే
కొల్లాపూర్‌ మార్కెట్‌లో సింగిల్‌విండో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

సింగిల్‌విండో సీఈవోపై కలెక్టర్‌ ఆగ్రహం

కొల్లాపూర్‌, మే 21(ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం 17శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదేశించారు.బుధవారం కొల్లాపూర్‌ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్న రకం ధాన్యం 14 శాతం, దొడ్డు రకం ధాన్యం 17శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేసిన సింగిల్‌విండో సీఈవో శ్రీనివాసులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత మైతే చర్యలు తప్ప వని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ ఆర్డీవో భన్సీలాల్‌, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:21 PM