రీసైక్లింగ్‌తో పర్యావరణ పరిరక్షణ
ABN , Publish Date - Dec 21 , 2025 | 10:52 PM
మునిసిపాలిటీ పట్టణ ప్రాంతంలోని డంపింగ్ యార్డులో ప్రతీ రోజు వెలువడే వ్యర్థ పదార్థాల ను రీసైక్లింగ్ చేయడంతో చక్కటి ఫలితాన్ని ఇ స్తోంది.
భూత్పూర్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీ పట్టణ ప్రాంతంలోని డంపింగ్ యార్డులో ప్రతీ రోజు వెలువడే వ్యర్థ పదార్థాల ను రీసైక్లింగ్ చేయడంతో చక్కటి ఫలితాన్ని ఇ స్తోంది. మునిసిపల్ కేంద్రంలోని కతికేవాని చెరు వు వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో గు ట్టలుగా ఉన్న చెత్తను బయోమైనింగ్ పద్ధతి ద్వారా చెత్త, ప్లాస్టిక్, గాజు సీసాలతో పాటు ఇత ర పనికిరాని వస్తువులను ప్రత్యేక యంత్రం ద్వా రా వేరు చేస్తున్నారు. ప్రతీ రోజు 5 నుంచి 10 టన్నుల చెత్త పట్టణ కేంద్రం నుంచి వెలువడు తోంది. ఈ చెత్తలో గాజు సీసాలు, ప్లాస్టిక్, ఇతర వస్తువులు గుట్టలుగా పేరుకుపోయి దుర్వాసన తో పాటు ప్లాస్టిక్ భూమిలో చేరి భూగర్భ జలా లకు ప్రమాదంగా మారుతోంది. ఉమ్మడి పాల మూరు జిల్లాలోని నారాయణపేట, భూత్పూర్ మునిసిపాలిటీలో బయోమైనింగ్ యంత్రం ద్వా రా చెత్తను వేరు చేస్తున్నట్లుగా తెలిసింది. ప్రతీ రోజు ఈ యంత్రం ద్వారా 500- 700 టన్నుల చెత్తను వేరు చేస్తున్నారు. ఈ చెత్త వేరు చేయ గా వెలువడే మట్టిని ఎరువుగా వాడుకొనే అవ కాశం ఉంది. ప్లాస్టిక్‌ను సిమెంట్ ప్యాక్టరీకి విక్ర యిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బయోమైనింగ్‌తో ఉపయోగం
డంపింగ్ యార్డు లో ఉన్న చెత్తలో ప్లా స్టిక్‌తో పాటు సీసా లు, ఇతర వ్యర్థ పదా ర్థాలను వేరు చేయ డంతో భూగర్భ జలా లకు ముప్పువాటిల్ల కుండా ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణ యం తీసుకొని ప్రత్యేక యంత్రం ద్వారా చెత్తను వేరు చేయడంతో చాలా ఉపయో గంగా ఉంటుంది.
- నురూల్ నజీబ్, కమిషనర్, భూత్పూర్